మనుషుల మనస్తత్వం వారు పుట్టిన వారాన్ని బట్టి కూడా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం పుట్టిన వాళ్లు గొప్ప వ్యక్తులు అవుతారు. శనివారం పుట్టడం ఓ గొప్ప వరం..
శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు. అలాంటి రూపాలలో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీవేకంటేశ్వరుడుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. […]