భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నడ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సంచారి విజయ్ (37) బ్రెయిన్-డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. జూన్ 12న ఫ్రెండ్‌ను కలుసుకొని, బైక్‌పై ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో యాక్సిడెంట్‌కు గురయ్యాడు విజయ్. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే బెంగళూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. రిపోర్టుల ప్రకారం ఆయన మెదడులోని కుడిభాగానికీ, తొడ ప్రాంతంలోనూ తీవ్ర గాయాలయ్యాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో […]