సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణాన్ని జీర్ణించుకోలేకముందే మరో గొంతుక మూగబోయింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ గాయని సంధ్య ముఖర్జీ నిన్న కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. దక్షిణ కోల్‌కతాలోని తన ఇంట్లోని స్నానాల గదిలో కాలు జారి పడిన ఆమె గత నెల 27న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆమెకు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. […]