తెలుగు ఇండస్ట్రీలో పోకిరి చిత్రంలో విలన్ గా నటించిన ఆశిష్ విద్యార్థి తర్వాత పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1986 లో ఆనంద్ అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
టాలీవుడ్ ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి ఎవ్వరూ ఊహించని విధంగా 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకొని అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. కుటుంబ సభ్యులు,సన్నిహితుల సమక్షంలో ఆశిష్, రూపాలిలు రిజిస్ట్రీ వివాహం చేసుకున్నారు. అయితే ఇంతకీ ఆశిష్ విద్యార్థి చేసుకున్న ఈ రూపాలీ బరువ ఎవరు?
60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి రెండో వివాహం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఓ మహిళను వివాహమాడారు. గురువారం వీరి పెళ్లి అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది.