జ్వరం వస్తే ఎవ్వరైనా సరే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. జ్వరమనే కాదు ఆరోగ్యం బాగోకపోతే వైద్యులను కలవడం మామూలే. వాళ్లు ఇచ్చే సూదులు, మాత్రలతో తిరిగి కోలుకుంటారు. అయితే కొందరు మాత్రం అనారోగ్యంగా ఉంటే డాక్టర్లను కాకుండా మూఢ నమ్మకాలను ఆచరిస్తుంటారు. అప్పటికీ తక్కువ కాకపోతే ఆర్ఎంపీ డాక్టర్‌ను కలిసి వైద్యం చేయించుకుంటారు. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు పెద్దాసుపత్రికి వెళ్తారు. అప్పటివరకు కోడిగుడ్లు, నిమ్మకాయలు, మూడు బజార్ల వైద్యం అంటూ లేనిపోని నమ్మకాలతో కాలం వృథా చేస్తారు. […]
భర్త అంటే భరించేవాడని పెద్దలు చెప్తుంటారు. పుట్టింటిని, కన్నవారిని వదులుకుని.. తన వెంట ఏడడుగులు నడిచి వచ్చిన భార్యను భర్త ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఆమె కష్టసుఖాల్లో తోడుగా నిలవాలి. కానీ ప్రస్తుతం సమాజంలో ఇందుకు విరుద్ధమైన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి నిజామాబాద్ లో వెలుగు చేసింది. భార్యకు అనారోగ్య సమస్య తలెత్తింది. దాంతో ఆర్‌ఎంపీగా పని చేస్తున్న భర్త తానే చికిత్స అందిస్తానని చెప్పాడు. భర్తను నమ్మిన […]