టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నపత్రాలు లీకయ్యాయి అనే వార్త తెలిసిన వెంటనే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజు రోజుకీ కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మంది నింధితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది.