చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం మండలం రాయలచెరువు వరద నీటి కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిరుపతి శివార్లలోని రాయలచెరువు కట్ట తెగిపోయే ముప్పు ఉండటంతో దాదాపు 40 గ్రామాల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. చెరువు కట్ట నీరు లీకేజీ అవుతుండటంతో.. రాయలచెరువు దిగువనున్న గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో పశువులను తోలుకుని కొండ ప్రాంతాలను చేరుకుంటున్నారు. రాయలచెరువు గ్రామం, కాలేపల్లి, చిట్టలూరు, గొల్లపల్లి, సూరవారిపల్లి చుట్టుపక్కల గ్రామాలకు నిన్న సాయంత్రానికే వరద చేరింది. […]