2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఐతే పవన్ ఓడిపోవడానికి కారణం కుల సమీకరణాలన్న విషయం అని అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో కులం పాత్ర చాలా పెద్దది. ఈ సమీకరణాలు తెలియకుండా భరిలోకి దిగితే ఓటమి చవి చూడవలసి వస్తుంది. అయితే ఈ ఓటమి నుండి జనసేనాని పాఠాలు నేర్చుకున్నట్టే కనబడుతోంది ప్రస్తుతం పవన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. ఎందుకంటే ఈసారి కూడా ఓడిన […]
ఏపీ మాజీ మంత్రి, టిడిపి నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను కొండాపూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ జరిగిన పదవ తరగతి పరీక్షల్లో వరుసగా.. ప్రశ్నా పత్రాలు లీకైన విషయం తెలిసిందే. ఈ విషయంపై పలువురు టీచర్లను అరెస్ట్ చేయగా.. వారంతా నారాయణ విద్యాసంస్థలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. నారాయణ అరెస్టు తో ఏపిలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ఈ విషయంపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ కు సవాలక్ష కారణాలు కన్పిస్తున్నాయి. ఆయన సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా చెస్తున్న ఆరోపణలు, గుప్పిస్తున్న విమర్శలు ఓ కారణమైతే.. జగన్ సర్కార్ పై రఘురామ కృష్ణరాజు వేస్తున్న కేసులు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అందులో ప్రధానమైంది అమూల్ డెయిరీ కేసు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవల్‌పమెంట్ ఫెడరేషన్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ ఈ నెల 4న జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రఘురామ […]
రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు రఘురామ అరెస్టుకు జవాన్లు సహకరించారు. ఆ వెంటనే రఘురామను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సొంత వాహనంలో వస్తానని రఘురామ చెప్పినా వినిపించుకోలేదు. ఆయనను బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఒక దశలో ఆయనను వాహనంలోకి బలవంతంగా తోసేశారు. ఎంపీ తనయుడు సీఐడీ పోలీసులను అడ్డుకోగా కోర్టులోనే తేల్చుకోండని స్పష్టం […]
హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణ రాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఎంపీ రఘురామ ఇంటిపై ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ శుక్రవారం రాత్రి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ […]
న్యూ ఢిల్లీ- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తనను ట్రాప్ చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. తనను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా మనుషులను నియమించి, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని రఘురామ కృష్ణం రాజు మండిపడ్డారు. సజ్జల సూచన మేరకు తనకు సుమారు ఒక వంద ఫోన్ కాల్స్ వచ్చాయని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం పతనావస్థలో […]