ఎన్నో ఆశలతో కళాశాలలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు.. ర్యాగింగ్ ఓ భూతంలా మారిపోయింది. విద్యా బుద్ధులు నేర్పాల్పిన విద్యాలయాలే ర్యాగింగ్ అడ్డాలుగా మారిపోతున్నాయి. తాజాగా మరో సారి రాకాసి ర్యాగింగ్ కలకలం రేపింది.
భారత స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్ హాస్టల్‌లో ఉన్నప్పుడు తాను ఎదుర్కున్న కష్టాలు, సీనియర్లు చేసిన ర్యాగింగ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. ఒడిషాలోని ఓ ప్రభుత్వ క్రీడా హాస్టల్‌లో ఇటీవల రుచిక అనే క్రీడాకారిణి సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ద్యుతీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తాను ఇదే హాస్టల్ లో రెండేళ్లు గడిపానని, తానూ ర్యాగింగ్ బాధితురాలినేనని పేర్కొంది. “హాస్టల్‌లో ఉన్నప్పుడు నేను కూడా ర్యాగింగ్ బాధితురాలినే. సీనియర్లు.. […]