Tollywood: టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది, కలెక్షన్స్ రావడం లేదు, ప్రేక్షకులు ఓటీటీలకు పరిమితం అయిపోయి థియేటర్లకు రావడం లేదు.. కాబట్టి కొన్నిరోజులు సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నాము అన్నది నిర్మాతల వాదన. నిజానికి నిర్మాతల కష్టాన్ని తక్కువ చేసి చూడలేము. కరోనా కాలం నుండి వీరికి గడ్డుకాలం ఎదురవుతూనే ఉంది. నిర్మాత బాగుంటేనే పరిశ్రమ కూడా బాగుంటుంది. సో.. నిర్మాతలు చెప్తున్న ఈ సమస్యల మీద చర్చ జరగాల్సిందే. […]
తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తీసుకున్న నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేశారు సీనియర్ నటుడు సుమన్. ఆగష్టు 1 నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత షూటింగ్స్ తిరిగి ప్రారంభించేది ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయంపై నటుడు సుమన్ స్పందిస్తూ.. సినిమా షూటింగ్స్ బంద్ అనే నిర్ణయం సరికాదని అన్నారు. బంద్‌తో ఓటీటీలకు ఎలాంటి నష్టం లేదని, కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని.. […]
తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సోమవారం (రేపటి) నుండి తెలుగు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా షూటింగ్స్ అన్ని నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు సైతం షూటింగ్ ని నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. ఫిలిం జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. […]
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలో కరోనా కారణంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను చవి చూసిన ఇండస్ట్రీ.. ఇప్పుడిప్పుడే కోలుకొని చిత్రీకరణలు ప్రారంభించింది. అయితే తాజాగా సినీ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే తమ్మారెడ్డి భరద్వాజ సైతం నిర్మాతల మండలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిర్మాతల మండలి ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ […]
టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అసహనం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ రేట్లు పెంచమని అడిగిన వాళ్లే.. ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారని.. హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్లే.. సినిమా టికెట్ ధరలు పెంచారనేది వాస్తవం కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వివాదంపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. […]