గత కొంత కాలంగా దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూ వస్తుంది. ఇటీవల దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అయినా ప్రస్తుతం ఆ సంఖ్య దిగి వస్తుంది. ఇప్పటి వరకు ఎంతో మంది సినీ సెలబ్రెటీలు, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు కరోనా భారిన పడ్డారు.. కొంత మంది కన్నుమూశారు. ముఖ్యంగా కరోనా సినీపరిశ్రమను పట్టిపీడిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకో స్టార్ కరోనా బారినపడుతున్నారు. తాజాగా సహజనటి జయసుధకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. […]
జంతువులకు కరోనా సోకడం మానవ జాతిని మరింత కంగారు పెడుతుంది. జులో ఉన్న జంతువులు కరోనాతో ఇబ్బంది పడటం జూ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా అట్లాంటా జూలలో కనీసం 13 గొరిల్లాలు కరోనా బారిన పడ్డాయని గుర్తించారు. మగ గొరిల్లాతో సహా 60 ఏళ్ల ఓజీ అనే గొరిల్లా కూడా కరోనాతో బాధపడుతుంది. గొరిల్లాలు దగ్గుతున్నట్లు, అలాగే జలుబుతో ఇబ్బంది పడటం ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు అక్కడ ఉన్న ఉద్యోగులు […]
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గచ్చిబౌళి లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన పోసాని తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ […]
వైరస్ జాడను పసిగట్టేందుకూ స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగపడతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి పరిశోధకులు ఎన్నో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిలో కోవిడ్ వైరస్‌ను గుర్తించేందుకు స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కోవిడ్‌ను వేగవంతంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అయితే ఈ పరీక్షల నిర్ధారణ కోసం ముక్కులో, గొంతులో పొడవైన స్వాబ్ పెట్టకుండా పరీక్షలు నిర్వహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. […]
ఇప్పుడు ఏ సినిమాలు రిలీజులు లేవు. ఫ్యాన్స్ హడావుడి అంతకన్నా లేదు.. ఎవరూ గడపదాటి బయటకు రావడంలేదు. అలాంటప్పుడు మహేష్‌బాబు ఇంటి ముందు భారీ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? మరి ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఇంటి ముందు భారీగా సెక్యూరిటీ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఎంతటివాళ్లనైనా బలి తీసుకొంటోంది. దానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. గొప్ప, పేద, […]
2020 ఐపీఎల్ సుదీర్ఘంగా వాయిదా పడి చివరికి దుబాయ్‌లో జరిగింది. కానీ ఈసారి 2021 ఐపీఎల్ సీజన్‌ను ఎలాగైనా ఇండియాలోనే నిర్వహించాలని భావించిన ఐపీఎల్ యాజమాన్యం జాగ్రత్తలతో స్టేడియంలను ఎంపిక చేసి ఆడియెన్స్ లేకుండానే మ్యాచులను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమైన 14వ సీజన్ ఐపీఎల్ సజావుగానే కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విరుచుకుపడింది. 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య […]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలో రోజురోజుకూ ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత కారణంగా డాక్టర్ సహా 8 మంది రోగులు మరణించారు. ఢిల్లీలో బాత్రా ఆసుపత్రిలో కొంతకాలం ఆక్సిజన్ అయిపోవడంతో ఎనిమిది మంది రోగులు మరణించారని ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్ శనివారం తెలిపింది. ఆక్సిజన్ కొరతతో మరణించిన వారిలో డాక్టర్లలో ఒకరు ఉన్నారని ఆసుపత్రి ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మరోవైపు […]