కొంతమంది ఎన్ని వేల కోట్లు ఆస్తి ఉన్నా చాలా సాధారణంగా ఉంటారు. ఆమె బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగారు. అయితేనేం చాలా సింపుల్ గా ఉంటారు. గుడిలో దేవుడికి స్వయంగా కట్టెల పొయ్యిపై ప్రసాదం వండి సమర్పించారు. మిగతా భక్తులలానే తాను కూడా సాధారణ భక్తురాలిగా గుడి బయట రోడ్డు మీద కూర్చుని పాయసం వండి నైవేద్యాన్ని సమర్పించి భక్తి చాటుకున్నారు.
మకర సంక్రాంతి.. తెలుగు ప్రజలకు ఇదే చాలా పెద్ద పండుగ, ఎంతో విశిష్టమైనది కూడా. ఈ పండుగకు పిల్లా పెద్ద అంతా కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. హరిదాసుల కీర్తనలు, బసవన్నల నృత్యాలు, ఇంటి ముందు రంగవల్లులతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మూడురోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజుని భోగి అని పిలుస్తారు. ఈ భోగి పండుగకు ఒక విశిష్టత ఉంది. మీకు భోగ భాగ్యాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు […]
మకర సంక్రాంతి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి పిల్లాపెద్ద అంతా స్వగ్రామాలకు చేరుకుని ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో ఇళ్లన్నీ పిల్లలతో కళకళాడుతున్నాయి. మూడ్రోజులపాటు జరుపుకునే ఈ పండగలో మొదటిరోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ అని అందరికీ తెలిసిందే. మొదటిరోజు భోగి మంటలు వేసుకుని తలార స్నానం చేసి సూర్యభగవానుడిని పూజిస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఇక ముఖ్యమైనది రెండో […]
సంక్రాంతి పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆ ఏముంది.. తినడం తాగడమే అని చాలామంది కుర్రాళ్లు సింపుల్ గా అనేస్తారు. ఇందులో మొహమాట పడటానికి ఏం లేదు కూడా. ఎందుకంటే జరిగేది అదే కాబట్టి! ఆంధ్రాలో అయితే ఈ పండగకు ఉన్న పాపులారిటీ వేరే లెవల్. మరీ ముఖ్యంగా సంవత్సరమంతా అక్కడా ఇక్కడా ఉద్యోగాలు చేస్తూ, సొంతూరికి దూరంగా ఉన్న వాళ్లంతా.. కూడా పుట్టిన ఊరికి వస్తారు. బాబాయి, పిన్ని, అత్త, మామ అంటూ చుట్టాలందరితోనూ […]
హైదరాబాద్ మహానగరం బోసి పోయింది. కరోనా లాక్ డౌన్ తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతా సంక్రాంతి పండగ వేళ ఊరికి ప్రయాణమవుతున్నారు. చాలా మంది ఇప్పటికే నగరం దాటేయగా.. సెలవులు దొరకని వారు ఇవాళ్టి వరకు ఆగినట్లు ఉన్నారు. బస్ స్టేషన్లు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. రైల్వేస్టేషన్లు కూడా ప్రయాణికుల రద్దీతో జాతర వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు షాకిచ్చింది. జనవరి 13, 14వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం షురూ అయిపోయింది. హైదరాబాద్ మహా నగరం ఇప్పటికే బోసిపోయినట్లుగా కనిపిస్తోంది. అంతా పండగకు ఊర్లు వెళ్లడం మొదలు పెట్టేశారు. ఇప్పటికే సగం సిటీ ఖాళీ అయిపోయింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ, రైల్వేతో పాటుగా ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఫుల్ రష్ గా ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ 3 వేల […]
మనం అనేక పండగలు జరుపుకుంటాం. వాటిల్లో ప్రధానమైన పండగ సంక్రాంతి. ఈ పండగను.. భోగి, మకర సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండగ కనుమ. దీన్నే పశువుల పండగ అని కూడా అంటారు. ఈ పండగ గురించి పురాణాల్లో చాలానే కథలు ఉన్నాయి. కనుమను పశువుల పండగగా ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన పురణాలు చెబుతున్నాయి. ఒక ఆచారంగా వస్తున్న ఇంద్రుడిని పూజించడం తగదని […]