గుడ్లను ఎప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి ఉడికించకూడదు. అలా చేస్తే పేలుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలామంది గుడ్లను మైక్రో ఓవెన్లో పెట్టి ఉడికిస్తున్నారు. ‘టిక్‌టాక్’లో వివిధ రకాల చిట్కాలను చెబుతున్నారు. కొందరు వాటిని గుడ్డిగా అనుసరిస్తూ ప్రమాదంలో పడుతున్నారు. ఇంగ్లాండ్‌లోని బోల్టాన్‌లో నివసిస్తున్న చాంటెల్లే కాన్వే అనే మహిళ కోడి గుడ్లను ఉడకబెట్టేందుకు మైక్రో ఓవెన్‌ను ఉపయోగిస్తోంది. సులభంగా, వేగంగా గుడ్లు ఉడుకుతాయనే ఉద్దేశంతో ఆమె కొన్నాళ్లుగా ఈ పద్ధతినే పాటిస్తోంది. […]