అప్పటివరకు అతను పిజ్జా డెలివరీ బాయ్.. కానీ, ఈ ఘటనతో ఆ ప్రాంతానికి అతనొక హీరో అయిపోయాడు. పిజ్జా డెలివరీ చేసి అర్ధరాత్రి ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఓ ఇల్లు మంటల్లో కనిపించింది. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లిపోయి ఐదుగురు సజీవదహనం కాకుండా కాపాడాడు. ఆ ఘటనలో అతనికి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని లఫయెట్టేలో నికోలస్ బోస్టిక్ అర్ధరాత్రి పిజ్జా డెలివరీ డ్యూటీ […]
కొందరికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే.. ‘ముక్కలేనిదే ముద్ద దిగదురా బాబోయ్’ అనేంతలా. ఉదాహరణకు ప్రైస్ ఎక్కువని వెజ్ బిర్యానీ బుక్ చేస్తే.. పొరపాటున నాన్ వెజ్ బిర్యానీ వచ్చిందనుకోండి. ఆహా.. ఆ సమయంలో మన ఆనందం ఎలా ఉంటుంది. తొందరగా ప్లేట్ తీసుకురా తినేద్దాం.. మళ్ళీ వాడొస్తాడేమో.. ఇదే ఆలోచనతో ఉంటాం. అచ్చం ఇలాంటి అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది. అయితే అయన మనలా ఆలోచించలేదు.. నేను శాకాహారిని అయితే.. నాకు […]
ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఆ రోజు నుంచే ప్రజలు భారీ సంఖ్యలో కాబుల్ విమానాశ్రయానికి చేరుకుని విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమానం రెక్కల మీద కూర్చొని తప్పించుకునేందుకు ప్రయత్నించిన కొందరు యువకుల ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలన కొనసాగుతున్నది. అక్కడ పరిస్థితులు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. తాలిబన్ల ఆక్రమణల సమయంలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ […]
పిజ్జా ఇష్టం లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టాలకు తగినట్లు దీన్ని తయారు చేసుకొని తింటారు. పిజ్జాతో పాటు నచ్చిన టాపింగ్స్, సాస్ వంటివన్నీ కూడా కస్టమర్లు ఎంచుకోవచ్చు. అయితే ఆ టాపింగ్స్ అనేవి మాత్రం కేవలం తినగలిగేవి అయితే సరిపోతుంది కానీ తినేందుకు వీలు కాకుండా నట్స్ ఇంకా బోల్ట్స్ వంటివన్నీ పెడితే ఇక ఎలా ఉంటుంది? ఇలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది బ్రిటన్ దేశానికి చెందిన […]
ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి రజతం సాధించడంతో యావత్ భారతావని సంబరాలు చేసుకుంది. పతకం నెగ్గిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి విలేకరులతో మీరా మాట్లాడింది. ముందుగా ఇంటికెళ్లి అమ్మానాన్నలను కలుసుకోవడంతోపాటు మరికొన్ని విషయాలు కూడా చెప్పింది. అయితే, నోరూరించే పిజ్జా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు చెప్పడం ఎక్కవగా ఆకర్షించింది. ‘ముందుగా వెళ్లి పిజ్జాను లాగించేస్తా. తిని ఎన్నో రోజులైంది. ఆరోజు చాలా తింటా’ అని చాను చెప్పింది. పిజ్జా కోసం తహతహలాడి పోతున్నానని […]