స్వదేశంలో తమ అభిమానుల ముందే పరువు పోగొట్టుకుంది పాకిస్థాన్. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారీ టార్గెట్ సెట్ చేసినా.. చిత్తుచిత్తుగా ఓడింది. 170 పరుగుల టార్గెట్‌ను 87 బంతుల్లోనే సమర్పించుకుని పాక్ బౌలర్లు విలన్లుగా మారారు. ఇంగ్లండ్ యువ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ బ్యాటింగ్ సునామీలో పాక్ కొట్టుకుపోయింది. పాక్ బౌలింగ్‌ను తుక్కు తుక్కుగా కొట్టిన సాల్ట్ 170 టార్గెట్ కేవలం 14.3 ఓవర్లలోనే ముగించి పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. మంచి […]