అన్నాచెల్లెల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేము. దేవుడు సృష్టించిన ఈ బంధంలో వారి మధ్య ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయి. ఎవరికి కష్టం వచ్చిన రెండో వారు తట్టుకోలేరు. తాజాగా ఓ అన్న.. గొడవలతో సాగుతున్న చెల్లెలి కాపురాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణం. అప్పుడే తిట్టుకుని అప్పడే కలిసిపోయే దంపతులు కూడా ఉన్నారు. కానీ ఇలా కాకుండా కొందరు భార్యాభర్తలు మాత్రం ప్రతీ దానికి గొడవ పడుతూ ఉంటారు. ఇక ఇంతటితో ఆగకుండా చివరికి హత్యలు, ఆత్మహత్యలతో జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ వివాహిత పెళ్లైన రెండేళ్లకే ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఆ వివాహిత ఎందుకు […]