ఆసియా కప్ 2023 వేదికపై ఇప్పటికీ సందిగ్దతే ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నజాం సేథీ కొన్ని చౌకబారు వ్యాఖ్యలు చేశాడు. పాక్ టీమ్ ను ఇండియాకు పంపాలంటే మాకు కూడా భయంగా ఉందని చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. బాబర్‌ను అలా ఎలా అంటావంటూ అక్తర్‌పై పాక్ మాజీ క్రికెటర్లు సహా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..!
టీమిండియాపై సందర్భం ఉన్నా.. లేకున్నా అక్కసు వెళ్లగక్కే పాక్ ఆటగాళ్లలలో ముందుంటాడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రజా. ఇప్పుడు అతడిపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత ప్లేయర్స్, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. దానికి కారణం ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో పాక్ దారుణంగా ఓడిపోవడమే. మూడు టెస్టుల సిరీస్ లో 2-0తో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పీసీబీ […]