మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మర్చిపోలేని అనుభూతి. దాంతో ఈ తంతును అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకుంటారు అందరు. అయితే కొన్ని రంగాలకు చెందిన వారికి హంగూ ఆర్భాటాలతో పెళ్లి చేసుకునేంత సమయం ఉండదు. దాంతో సాదాసీదాగా వివాహతంతును కానిస్తారు. ప్రస్తుతం ఇలానే తమ పెళ్లిని సాదాసీదాగా చేసుకున్నారు ముగ్గురు క్రికెటర్లు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? వీరు ముగ్గురు ఒకే రోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పైగా ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు […]
యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022 పోరులో శ్రీలంక జట్టు ఛాంపియన్ గా అవతరించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్తాన్ లాంటి బలమైన జట్లను కూడా అలవోకగా ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇది గడిచిన నెలలోపే శ్రీలంక పరిస్థితి అద్వాన్నంగా తయారయ్యింది. టీ20 ప్రపంచ కప్ పోరులో నిలబడాలంటే(సూపర్-12కు అర్హత సాధించాలంటే) తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో తలకిందులవుతోంది. టోర్నీ తొలి మ్యాచులోనే పసికూన నమీబియా చేతిలో ఓటమి పాలయ్యింది. ఇది చాలదన్నట్టు ఇవాళ యూఏఈతో […]
స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న శ్రీలంక ఆటగాళ్లపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆతిధ్య జట్టుకు చెందిన ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇక రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగానే ఓపెనర్ పథుమ్ నిస్సంకకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆటగాళ్లు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన లంక ఆటగాళ్ల సంఖ్య ఆరుకు చేరింది. మూడో రోజు ఆట మధ్యలో అస్వస్థతకు గురైన నిస్సంకకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ […]