స్నేహం అవసరాలకు వినియోగించుకునే వస్తువు కాదూ. ఆపదలో ఆదుకునే బంధువు స్నేహితుడు. ఎంతో కాలంగా ఓ సమస్యతో ఇబ్బంది పడుతున్న తన స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలవడమే కాదూ.. ఆ సమస్యను నుండి శాశ్వతంగా గట్టెక్కించారు మహిళలు. ఇంతకు వారు చేసిన ఉపకారం ఏంటంటే.?
ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబందించి పుట్టుకొచ్చిన ఉద్యమం మీటూ. దీన్ని వేదికగా చేసుకుని అనేక మంది మహిళలు తమ గళాన్ని విప్పుతున్నారు. అనేక సందర్భాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ప్రముఖులు సైతం తమ వేదనను వెలిబుచ్చుతున్నారు. నటి, బీజెపీ నేత ఖుష్బు, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ వంటి వారు చిన్న వయస్సులో ఎదుర్కొన్న వేధింపులను చెప్పారు. ఇప్పుడు ఆ జాబితాలో ఓ అధికారిణి చేరింది.
ఈ మద్య మహిళలపై ఎక్కడ చూసినా అత్యాచారాలు.. లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. దారుణం ఏంటంటే కామంతో రెచ్చిపోతున్న కొంతమంది దుర్మార్గులు వావివరుసలు మర్చిపోయి దారుణాలకు తెగబడుతున్నారు. కన్న కూతురుపై అత్యాచారం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. దివ్యాంగురాలైన బాలిక తండ్రి పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన కేరళాలో వెలుగు చూసింది. ఇటీవల కొంత మంది కామంతో రెచ్చిపోయి వావివరుసలు […]
మనిషి ఇప్పటి వరకు ఎన్నో రంగాల్లో అభివృద్ది సాధించాడు. భూమీ, ఆకాశం, సముద్రం అన్నింటా తన ఆదిపత్యాన్ని చాటుకుంటున్నాడు. ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది సాధించింది. అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు.. వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఇప్పికీ కొన్ని చోట్ల దెయ్యాలూ.. భూతాలు ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. క్షుద్ర పూజలు చేస్తే తాము కోరుకున్నది సిద్దిస్తుందని నమ్మే అంధవిశ్వాసులు ఉన్నారు. క్షుద్ర పూజలు చేస్తే.. నర బలులు ఇస్తే ఆకస్మిక […]
శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగానే ‘యస్’ తుపాను క్రమంగా తీవ్రమై మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు ‘‘రెడ్ అలర్ట్’’ జారీ అయింది. రాత్రి 8.30 గంటలకు ఐఎండీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇది ఒడిశాలోని పారాదీప్‌కి 160 కి.మీ. దూరంలో, ఆ రాష్ట్రంలోని బాలాసోర్‌కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 240 కి.మీ., సాగర్ ద్వీపానికి 230 కి.మీ.దూరంలో ఉంది. గంటకు 15 […]