హ్యాట్రిక్ డకౌట్. సూర్యకుమార్ వల్ల ఈ మధ్య ఇది బాగా వినిపించింది. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో పాక్ క్రికెటర్ చేరాడు. అతడి పరిస్థితి అయితే సూర్య కంటే దారుణంగా ఉంది.
టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఇదే పెద్ద విచిత్రం కాకపోయినప్పటికీ.. అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమిపాలవడం మాత్రం అందరూ మాట్లాడుకోవడానికి కారణమైంది. ఈ క్రమంలోనే అఫ్గాన్ జట్టు పొట్టి ఫార్మాట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్‌ఫోర్‌లో బుధవారం పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ మధ్య సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. చిన్న టార్గెట్‌ను కాపాడుకునేందుకు అఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాట పటిమను చూపించింది. ఇక మ్యాచ్ చివర్లో తీవ్ర ఉత్కంఠ మధ్య ఆటగాళ్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. పాక్ హిట్టర్ ఆసిఫ్ అలీ-ఆఫ్ఘాన్ పేసర్ ఫరీద్ గ్రౌండ్‌లోనే కొట్టుకున్నంత పనిచేశారు. 12 బంతుల్లో 21 పరుగులు కాపాడుకోవాల్సిన టైమ్‌లో భారీ సిక్స్ కొట్టిన ఆసిఫ్ అలీని తర్వాతి బంతికే అవుట్ చేసిన ఫరీద్ […]
ఆసియా కప్ 2022లో అసలు సిసలైన క్రికెట్ మ్యాచ్ బుధవారం జరిగింది. సూపర్ ఫోర్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ అంచనాలకు మించి రాణించింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 129 పరుగులు మాత్రమే చేసినా.. తమ బౌలింగ్ ఎటాక్‌తో పాకిస్థాన్‌ను గడగడలాడించింది. ఒక వైపు నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ సాగుతుంటే.. మరోవైపు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధంతో మరింత వేడి పెరిగింది. 19వ ఓవర్‌లో పాక్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ, ఆఫ్ఘాన్ […]