ఆంధ్రప్రదేశ్ టీడీపీ లో విషాదం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి(68) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో.. కుటుంబ సభ్యులు అమలాపురంలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రాజకీయాల్లోకి రాకముందు అయన బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం చేసేవారు. 1996లో టీడీపీ లో చేరి ‘నగరం’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004లో తన స్థానాన్ని బీజేపీ కి […]