బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వచ్చారు. ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి బంగారు బొనమెత్తారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు అందరితో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా కుప్పకూలి హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు.
ఇటీవల ఆర్బీఐ రూ.2 వేల నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలకు రెండు వేల నోట్లు మార్చే విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.
సాధారణంగా పారిశ్రామికవాడలక సమీపంలో ఉండే బస్తీల్లో దుర్వాసనలు భరించలేని విధంగా వస్తుంటాయి. రసాయినాల కలయిక వల్ల ఈ వాసనలు వస్తుంటాయి. ఈ మద్య కొన్ని కెమికల్ ఫ్యాక్టరీల సమీపలో దుర్గందాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
మనిషి ప్రాణం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. కానీ ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే మృత్యువు ఎటువైపు నుంచి పొంచిఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచి బయటకి వచ్చినవారు క్షేమంగా ఇంటికి వెళ్తారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
లష్కరే తోయిబా, ఐఎస్ఐ సాహకారంతో హైదరాబాద్ లో గతేడాది దసరా పండగ నేపథ్యంలో వరుస పేలుళ్లకు పథకం రచించారు. ఈ పేలుళ్లలో భాగంగా పాతబస్తికి చెందని ఓ యువకుడి సాహకారాన్ని కూడా తీసుకున్నారు. దీనికి వెనుక అసలు ఏం జరిగిందంటే?
నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లలిత్‌భాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఇదొక గ్యాంగ్ వార్ అని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లలితాభాగ్‌కు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, అతని మేనల్లుడు సయ్యద్ ముర్తజా అనస్ పై కత్తులతో దాడి చేశారు. […]
అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నాం.. భూగోళం ఆవల ఏమున్నాయో పరిశోధిస్తున్నాం.. వైద్య, శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నాం. నాగరిక సమాజంలో బతుకుతున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ సమజాంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. మరో 100 ఏళ్లు గడిచినా.. మూఢనమ్మాకాలు, నకిలీ బాబాల వంటివి మాత్రం మాసిపోవని అనిపిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా.. నేటి కంప్యూటర్ కాలంలో కూడా చేతబడులు, క్షుద్ర పూజలు వంటివి వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరం […]
హైదరాబాద్ పాతబస్తీలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్లు కొంతమంది ఆగంతకులు కాల్ చేసి బెదిరించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు చార్మినార్ కి చేరుకొని పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటల సేపు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. చేస్తూనే ఉన్నారు. చార్మినార్ దగ్గర ఫుట్ పాత్ లపై ఉన్న షాపు యజమానులను అక్కడి నుంచి పంపించేశారు. చార్మినార్ దగ్గర షాపులు, […]
శ్మాశానాలకు సంబంధించి ఇప్పటివరకు చాలా వార్తలు విని ఉంటారు, చాలా వార్తలు చూసుంటారు. కానీ, ఈ వార్త మాత్రం చాలా ప్రత్యేకం. కేవలం ప్రత్యేకం మాత్రమే కాదు.. భయానకం కూడా. శ్మశానంలో క్షుద్రపూజలు, శవాలు మాయం, సమాధుల కూల్చివేత ఇలాంటి వార్తలే ఇప్పటివరకు విని ఉంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వార్తను ఇప్పటివరకు ఎప్పుడూ విని ఉండరు. అదేంటంటే.. శ్మశానంలోని శవాలు మాయమవుతున్నాయి. అయితే వాటిని ఎవరూ దొంగిలించడం లేదు, ఎవరూ సమాధులు పగలగొట్టడం లేదు. కొన్ని […]