బిడ్డ బాధ తల్లికే అర్దమవుతుందని ఊరికే అనలేదు. గుక్క పట్టి ఏడుస్తున్న ముక్కు ముఖం తెలియని పసిపాపకు ఆ తల్లి పాలిచ్చి లాలించింది. పోలీసులంటే కఠినంగానే కాదు ప్రేమగా కూడా ఉంటారని ఆ మహిళా పోలీస్ నిరూపించింది. విధులు నిర్వహిస్తూనే ఆకలితో అలమటిస్తున్న పసిబిడ్డకు అమ్మగా మారారు.
నార్సింగిలో మరో ఇంటర్ విద్యార్థి గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక కుమారుడి మరణవార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అసలేం జరిగిందంటే?
కుటుంబాల్లో కలహాలకు కారణమౌతోంది మద్యం. జీవితాలను చిధ్రం చేస్తుంది. దీనికి బానిసలైన మందు బాబులు..కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. ఈ వ్యసనం కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో ఈ మద్యానికి వ్యతిరేకంగా ఓ ఊర్లోని మహిళలు ఉద్యమించారు.
హైదరాబాద్ లోని నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిపుణుల విచారణ కమిటీ నివేదికను పరిశీలించిన తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.
నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలను ఎదుర్కుంటున్న.. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్, టీచర్ శోభన్ ను అరెస్ట్ చేశారు.
మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఇంటర్ విద్యార్థి సాత్విక్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఘటనపై తాజాగా కాలేజీ యాజమాన్యం స్పందించింది.
నార్సింగి చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఈ ఘటన మొదటి నుంచి ఏం జరిగింది? పూర్తి అప్ డేట్స్ మీ కోసం.
కాలేజీలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులను భరించలేక ఇటీవల ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ మరణించింది. ప్రీతి ఘటన మరువక ముందే మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంతో అనేక దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులపై దాడి చేయడం, లేక తామే ఆత్మహత్య చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి ఇష్టంలేని పెళ్లి చేశారని ప్రియుడి కలిసి పారిపోయింది. నాలుగు రోజుల తరువాత చూస్తే..
ఈ మధ్యకాలంలో పేలుడు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలా అకస్మాత్తుగా సంభవిస్తున్న పేలుడు ప్రమాదాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల కారణంగా మరికొందరికి అంగవైక్యలం ఏర్పడి.. జీవితాన్ని అతికష్టం మీద వెళ్లదీస్తున్నారు. ఇటీవలే విశాఖపట్నంలోని పరవాడ ప్రాంతంలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. అంతేకాక పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మరువక ముందే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డులో పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనలో […]