టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి నారావారి కుటుంబం భారీ విరాళాన్ని అందజేసింది.
తిరుమల తిరుపతిలో అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది ప్రముఖులు తమ, కుటుంబ సభ్యులు, సన్నిహితుల పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం చేపిస్తారు. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు కానుకగా టీటీడీలో ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే రూ.30 లక్షల రూపాయల మొత్తాన్ని చంద్రబాబు కుటుంబం […]