పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమయ్యి ఉంటాయి అంటారు. స్వర్గం మాటేమో కానీ.. కొన్ని పెళ్లిళ్లు పెళ్లి పీటల మీదే పెటాకులు అవుతున్నాయి. మొన్న కట్నం చాలలేదని భద్రాద్రి గూడెం జిల్లా అశ్వారావు పేటకు చెందిన పెళ్లికుమార్తె పెళ్లి ఆపేసిన ఘటన మర్చిపోక ముందే.. మరో చోట మరో యువతి వరుడు నిర్వాకం కారణంగా పెళ్లిని రద్దు చేసింది.