మతం అంటే ఒక జీవన విధానం. దేవుడ్ని భక్తి మార్గంలో చేరుకునే ఒక గమ్యం. ఎవరెలా బతికినా అంతిమంగా మాట్లాడేది దేవుడి గురించే. ఒకరి మత విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఎలాంటి సమస్య ఉండదు. ‘మన మతాన్ని ప్రేమిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం’ అనే నినాదంతో చాలా మంది వివిధ మతస్తులు ఇతర మతస్తులతో తోబుట్టువుల్లా జీవిస్తున్నారు. అందుకే ఈ దేశం ప్రపంచ దేశాల సిద్ధాంతాల కంటే గొప్ప సిద్ధాంతం అయిన భిన్నత్వంలో ఏకత్వంగా […]
ప్రతి ఏటా కేరళలో రామాయణ మాస సంబరాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయాల్లో, ఇళ్ళలో రామాయణ గ్రంథాన్ని పఠిచడం అక్కడ ఆనవాయితీ. అయితే అక్కడ రామాయణాన్ని పఠించేది కేవలం హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా. అవును ఉత్తర కేరళ జిల్లాకి చెందిన ఇద్దరు ముస్లిం యువకులు రామాయణాన్ని చదువుతారు. కేవలం ఒక్కరోజో, ఒక్క నెలో కాదు నిత్యం రామాయణ పఠనం చేస్తారు. మొహమ్మద్ జబీర్ పీకే, మొహమ్మద్ బాసిత్.. వీరిద్దరూ వాలంచేరిలో ఉన్న కెకెఎస్ఎమ్ ఇస్లామిక్ […]
ఆరేళ్లుగా యాదాద్రి నరసింహుని దివ్వదర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు మార్చి 28 నుంచి ఆ భాగ్యం కలగనుంది. మార్చి 28 న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ తర్వాత నుంచి భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. […]
పెళ్లి అంటే జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అని భావిస్తుంటారు. దాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా మలుచుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. డబ్బున్న మారాజులు ఏం చేసినా పర్లేదు.. కానీ వారిని చూసి సామాన్యులు కూడా ఆడంబరాలకు పోయి అప్పులపాలవుతున్నారు. ముఖ్యంగా పెళ్లి విందులో ఎన్ని రకాల వంటలు వడ్డిస్తే.. అంత గొప్ప అని ఫీలవుతున్నారు. పలు రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొండెక్కిన నిత్యవసరాల ధరలు, కూరగాయల ధరలతో ఈ విందు […]
న్యూఢిల్లీ- పాఠశాల విద్యార్థుల చేత సూర్య నమస్కారాలు చేయించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏ ఐ ఎల్ పీ ఎం బీ) నిరసన వ్యక్తం చేస్తోంది. ఇది ఇస్లాంకు వ్యతిరేకం అని తెలిపింది. ఆ వివరాలు.. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా […]