తన పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ను సస్పెండ్ చేయాలని మంత్రి కేటీఆర్ సంబంధింత అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం అధికారులు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. జూలై 24 మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ గోపు గంగాధర్ […]
ఏపీలో కొత్తగా ఇటీవల చెత్త పన్ను వసూలును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చెత్తపై పన్నేంటంటూ.. చాలామంది ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గొడవ కూడా చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం చెప్పినట్లు చెత్తపన్ను చెల్లించని వారిని మునిసిపల్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చెత్త పన్ను చెల్లించని వారికి చుక్కలు చూపిస్తున్నారు. బుధవారం చెత్త పన్ను వసూలు కోసం వెళ్లిన కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది.. చెత్త పన్ను ఎందుకు […]