పెళ్లంటే నూరేళ్ల పంట.. కానీ ఆ జంటకు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సమయంలో వారం రోజులకే నవదంపతులిద్దరూ కరోనాబారినపడగా.. భార్య త్వరగానే కోలుకుంది. యువకుడికి కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయాడు. కరోనా బారినపడి భర్త చనిపోతే.. కన్నీటి బాధలో ఉన్నా కూడా ఆ యువతి మంచితనాన్ని చాటుకుంది. కరోనా పోరాడుతున్న సమయంలో పలువురు తనకు చేసిన సహాయం […]