ఈ మధ్య దేశంలోని పలు రాష్ట్రాలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. కరెంట్ ఉండే సమయంలో కంటే కోతల సమయం ఎక్కువగా ఉందనేది చాలా మంది అభిప్రాయం. అలా విద్యుత్ లేకపోవడంతో ఆసుపత్రుల్లో రోగులు నరకం అనుభవిస్తున్నారు. కొన్నిచోట్ల టార్చ్ లైట్ వెలుగుల్లో ఆపరేషన్ లో చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ ఆసుపత్రిలో వృద్ధురాలికి చికిత్స చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ పోయింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. […]