ఇప్పటికే గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. గత నెలలో 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్, 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. బీసీ గురుకులాలు, సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. […]
దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కి చేరుకుంది. ఢిల్లీ 67, తెలంగాణ 38 కేసులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే వారికే ఒమిక్రాన్ పాజిటివ్ వస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాదులో 30కి పైగా […]