నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని ఆయన నివాసంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.
తనను నియోజకవర్గం నుంచి తరిమికొడతాం అన్న వైసీపీ నేతలకు సవాల్ విసురుతూ.. గురువారం ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని, ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరాడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్. దాంతో అక్కడ వాతావారణం ఒక్కసారిగా హీటెక్కింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త కుంపటిని రాజేసినట్లు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది. ఈ క్రాస్ ఓటింగ్ ఘటను సీరియస్ తీసుకున్న పార్టీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురైయ్యారు. దాంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నెల్లూరు లోని అపోలో ఆస్పత్రికి ఆయనను తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెలోని రెండు వాల్వ్ లు మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 2019లో వైసీపీ తరపున ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు చంద్రశేఖర్ రెడ్డి. కాగా ఇటీవల గుండెపోటుతో మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డికి బాబాయ్ అవుతారు […]
ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తరచు వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఓ యువకుడి విషయంలో వార్తల్లో నిలిచారు. అంతేకాక ఇటీవల నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయ్ రెడ్డిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిశీలకుడిగా వచ్చిన వ్యక్తి నియోజకవర్గంలో అసంతృప్తి వర్గాన్ని రెచ్చగొడుతున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా తరచూ ఆసక్తికర వ్యాఖ్యలతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అనే […]
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. గత కొన్నేళ్లుగా మేకపాటి కుటుంబమే సింహపురి రాజకీయాలను శాసిస్తూ వచ్చింది. అయితే ఇటీవల కొంతకాలం నుంచి వారి ఫ్యామిలీలో చిన్నపాటి మనస్పర్ధలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో మేకపాటి ఫ్యామిలీలో మరో కలకలం చెలరేగింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకుని తానేనంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో లేఖ పోస్ట్ చేశారు. ఆయన కొడుకుగా తనను గుర్తించాలంటూ శివచరణ్ రెడ్డి అనే […]