ఉప్పు, పప్పు, పాలు, నూనే, మాంసం కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కొంతమంది వ్యాపారస్తులు కాసులకు కక్కుర్తి పడుతూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ పాలు, కుల్లిన మాంసం హూటల్స్ కి సప్లై చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
మీరు మాంసం ప్రియులా? ముక్కలేనిదే ముద్ద దిగడం లేదా? అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. కొందరు మాంసం అమ్మకం దారులు వినియోగదారులను నట్టేట ముంచుతూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మున్సిపల్ అధికారులు జరిపిన దాడుల్లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి. ఇక విషయం ఏంటంటే..? జిల్లాలోని సాలూరు ప్రాంతంలో ఉన్న మాంసం దుకాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో మున్సిపల్ అధికారులు హుటాహుటిన దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులకు సుమారు […]
కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఆచారాల్లోనూ ప్రతిఫలిస్తోంది. తెలుగు నేలపైన ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆలయంలో నైవేద్యంగా ఏ పులిహోర, చక్కెర పొంగలి, స్వీట్లో సమర్పిస్తారు. వీటికి విరుద్దంగా మద్యాన్ని సమర్పించే విచిత్రమైన ఆనవాయితీ కొనసాగుతోంది. పురుషులు మాత్రమే పాల్గొనే వేడుక. మందు, విందుతో దేవుడికి నైవేద్యం పేరుతో మజా చేసే సంస్కృతి. పూర్వీకుల పేరుతో ఆచారం పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది ఈ […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొనడం కలకలం రేపుతోంది. భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం నిలిపివేసి ఇందులోని మాంస పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని వెల్లడించింది. […]
తమకు నచ్చిన ఆహారం కోసం కొంత మంది ఎంతదూరమైన వెళతారు. అంతేకాదు దాని కోసం ఎంత డబ్బులు అయినా ఖర్చు చేస్తారు. కొన్ని మనకు అందుబాటు ధరలో ఉంటాయి. మరికొన్ని మాత్రం బాగా ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. ఇది కూడా అలాంటిదే. అదే స్పెయిన్లోని పంది మాంసం. పంది ఒక లెగ్ ధర లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి హామ్ తయారు చేస్తారు. దాని రుచి, తయారీ ప్రక్రియ కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. […]