శాస్త్ర సాంకేతికతకు సైతం అంతు చిక్కని రహస్యాలున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్స్, బ్లాక్ హోల్ వంటివి కూడా ఇంకా సరైన సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే ఉన్నాయి. అలాగే ప్రకృతి తన ఒడిలో అనేక రహస్యాలను దాచుకుంది. వాటిల్లో హిమనీనదాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి బ్లడ్ ఫాల్స్ రివర్ అంటారు. అంటార్కిటాకాలో ఉన్న ఈ నదీ రహస్యాన్ని శాస్త్రవేత్తలు చేధించారు.