దేశ రాజకీయాల్లో పవర్ ఫుల్ మహిళా నేతల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా ఒకరు. ఏదైనా నిక్కచ్చిగా, ముక్కు సూటిగా మాట్లాడటం ఆమె నైజం. అధికార పార్టీనైనా సరే పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తారు. గత ఏడాది చివర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా దేశంలో తగ్గిపోతున్న పారిశ్రామికోత్పత్తిపై..కేంద్రంలోని అధికార పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ అవసరమంటూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సూచించారు. పార్లమెంట్ లో ఈమె చేసే […]