M Ramakrishna Reddy: ప్రముఖ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు రామకృష్ణారెడ్డి మృతిపై సంతాపం తెలిపారు. కాగా, రామకృష్ణారెడ్డి 1948 మార్చి 8వ తేదీన నెల్లూరులోని గూడూరులో శ్రీమతి మస్తానమ్మ, ఎం.సుబ్బరామిరెడ్డి దంపతులకు జన్మించారు. చదువు పూర్తిచేసుకున్న తర్వాత సిమెంట్ రేకుల బిజినెస్ చేశారు. ఆ తర్వాత బంధువుల […]