హైదరాబాద్ నగరంలో ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఆ తర్వాత షాపింగ్. అయితే ఇటీవల అన్ని షాపింగ్స్‌కి అనువుగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేస్తున్నాయి. ఇన్ ఆర్బిటల్ మాల్, ఫోరం మాల్, గలేరియా, జీవికే, ఏఎంబీ, మంజీరా మాల్స్ వంటివి అందుకు ఉదాహరణ.
ప్రజలను ఆకర్షించడానికి పలు కంపెనీలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు.. రక రకాల ఆఫర్లు పెడుతుంటారు. జనాలకు ఏవైనా షాపుల వాళ్లు బంపర్ ఆఫర్లు ప్రకటించారంటే చాలు.. ఆ షాపుల ముందు క్యూ కడతారు. పనులన్నీ మానుకొని అక్కడ ప్రత్యక్షమవుతారు. ఓ షాపింగ్ మాల్ భారీగా ఆఫర్ ప్రకటించగానే.. కస్టమర్ల తాకిడి కూడా ఊహించని రీతిలో ఎక్కువైంది. ఒకనొక దశలో సిబ్బంది ఏం చేయలేక చేతులెత్తేసింది కూడా. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. […]