లోన్ యాప్‌ల కారణంగా మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తరచుగా ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ మధ్యకాలంలో లోన్ యాప్ వేధింపులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ యాప్ ల వేధింపుల కారణంగా ఎందరో బలవుతున్నారు. తాజాగా ఓ యువకుడు జీవితంగా కూడా లోన్ యాప్ వేధింపుల కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది.
కేంద్ర ప్రభుత్వ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 232 యాప్ లను బ్యాన్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వ రద్దు చేసిన ఆ యాప్ లు ఏంటి? అసలు ఎందుకు భారత్ ఒకేసారి అన్ని యాప్ లను బ్యాన్ చేసింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ లో చలామణి అవుతున్న చైనా యాప్ లపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 232 యాప్ లపై నిషేధం విధిస్తూ […]
లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. జనం నంబర్లు సేకరించడం, లోన్ తీసుకునే వరకూ ఫోన్లు చేయడం, లోన్ చెల్లించకపోతే బెదిరింపులకు పాల్పడడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను వెబ్ సైట్ లో పెడతామని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడతారు. అక్కడితో ఆగకుండా లోన్ తీసుకున్న వ్యక్తి తాలూకా వ్యక్తులకు ఫోన్లు చేసి విసిగిస్తారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి సైతం లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్లు చేశారు. మంత్రినే […]
అవసరం ఉన్నా లేకపోయినా సరే.. కాల్ చేసి మంచిగా మాట్లాడి.. మన చేత అప్పు చేయించి.. ఆ తర్వాత నరకం చూపిస్తున్నారు లోన్ యాప్ నిర్వాహాకులు. కాబూలీ వాళాల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా ఆన్‌లైన్‌లోనే జరగడంతో.. మన జుట్టు వారి చేతుల్లోకి వెళ్తుంది. డబ్బులు కావాలంటే సదరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అది అన్ని రకాల పర్మిషన్లు అడుగుతుంది. డబ్బు అవసరం కారణం చేత అన్నింటికి ఓకే చెప్తున్నాం. ఇక […]
ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక రాజమహేంద్రవరంలో కొల్లి దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముక్కుపచ్చలారని ఇద్దరు పసి బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్లారంటే.. లోన్ యాప్ నిర్వాహాకులు వారిని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో.. న్యూడ్ ఫోటోలు స్నేహితులకు, బంధువులకు పంపుతామని బెదిరిస్తుండటం.. అప్పు తీసుకున్న విషయాన్ని అందరికి చెప్పడంతో.. పరువు పోయిందని భావించిన దుర్గాప్రసాద్ […]
అప్పు.. ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఇది బాగా సుపరిచితం. తన జీవితంలో కనీసం ఒక్కసారైనా దీనిని పలకరించే ఉంటాడు. ఇంటి నిండా అవసరాలు, అరకొర జీతాలు.. ఒకటో తారీఖు రాగానే వాయిదాల రిమైండర్లు. ఈఎంఐ అమౌంట్ మారడమో.. కట్టే డేట్ మారడమో జరుగుతుంది తప్ప.. ప్రతి సాధారణ వ్యక్తి జీవితం దాదాపు ఇలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ల అవసరాలను అవకాశాలుగా మలుచుకుని ఈ లోన్ యాప్స్.. ఒక చీకటి సామ్రాజ్యంలా ఎదిగాయి. ఇప్పుడు వీళ్ల ఆగడాలు ఎంతలా […]
లోన్ యాప్స్.. గత కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియా, మీడియా అంతా చక్కర్లు కొడుతోంది. వ్యక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇచ్చిన మొత్తానికి వడ్డీలు, చక్ర వడ్డీలు, భూచక్ర వడ్డీలు వేస్తూ పీల్చి పిప్పి చేస్తున్నారు. కట్టలేమంటే బంధువులు, మిత్రులకు వారి వివరాలను పంపుతూ పరువు బజారుకీడుస్తున్నారు. వీరి ఆగడాలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వేధింపుల సెగ మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం తాకింది. మాజీ మంత్రి అనిల్ […]
లోన్ యాప్స్ నిర్వాహకులు మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో ఈ వ్యాపారాన్ని వారు వదులుకోవడంలేదు. గతంలో వీరి వేధింపులతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కొద్ది నెలల ముందు లోన్ యాప్ సంస్థలపై దాడులు చేయడంతో ఈ దందాకు కొంతకాలం తెరపడింది. అయితే.. మళ్లీ వెలుగులోకి వచ్చిన లోన్ సంస్థలు రుణ గ్రహీతలకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాయి. తాజాగా వీరి వేధింపులు భరించలేక ఒక […]