ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంకా కొనుగోలు, యాజమాన్యం మార్పు ప్రక్రియలు పూర్తి కాలేదు. ఈలోపే ట్విట్టర్ లో తీసుకోరాబోతున్న పెను మార్పులను అడపాదడపా మస్క్ ప్రస్తావిస్తూనే ఉన్నాడు. వాటిలో భాగంగా ట్విట్టర్ ఖాతాను జీవితకాలం బ్యాన్ చేయడంపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ లో ట్వీట్లు తొలగించడం, జీవితకాలం బ్యాన్ చేయడం సరైన నిర్ణయం కాదంటూ వ్యాఖ్యానించాడు. అదే విషయంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు డోర్సే […]
ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం ప్రతీ క్రీడాకారుడికి ఒక కలలాంటిది. దీని కోసమే జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అయితే ఒక్కసారి ఈ పతకాన్ని సంపాదించుకుంటే మాత్రం ఇకపై జీవితంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. భారత్ కి మెడల్స్ అందిస్తున్న ప్లేయర్లకు దేశంలో టాప్ మోస్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒకపక్క కంపెనీలు మరో పక్క రాజకీయ నాయకులు కూడా ఒలంపిక్ విజేతలకు అండగా నిలబడుతూ వారి భవిష్యత్తు స్థిరపడేలా హామీలు అందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఇండియాకు […]
ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి రజతం సాధించడంతో యావత్ భారతావని సంబరాలు చేసుకుంది. పతకం నెగ్గిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి విలేకరులతో మీరా మాట్లాడింది. ముందుగా ఇంటికెళ్లి అమ్మానాన్నలను కలుసుకోవడంతోపాటు మరికొన్ని విషయాలు కూడా చెప్పింది. అయితే, నోరూరించే పిజ్జా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు చెప్పడం ఎక్కవగా ఆకర్షించింది. ‘ముందుగా వెళ్లి పిజ్జాను లాగించేస్తా. తిని ఎన్నో రోజులైంది. ఆరోజు చాలా తింటా’ అని చాను చెప్పింది. పిజ్జా కోసం తహతహలాడి పోతున్నానని […]