మాస్ రాజా రవితేజ సినిమాలంటే ప్రేక్షకులకు ఎంత వినోదాన్ని అందిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ కి మాస్.. క్లాస్ కి క్లాస్ ఎలిమెంట్స్ అన్ని జోడించి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందిస్తుంటారు దర్శకులు. అలా రవితేజతో హ్యాట్రిక్ సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని. వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు తెరపైకి వచ్చాయి.. ఒకదాన్ని మించి మరో సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. […]