క్రికెట్ అభిమానులు మూడేళ్లుగా ఎదరుచూస్తున్న క్షణం ఆసియా కప్‌లో ఆవిష్కృతమైంది. సింగిల్ తీసినంత ఈజీగా సెంచరీలు కొట్టిన కోహ్లీ 71వ సెంచరీ ఎప్పుడెప్పుడు చేస్తాడా అంటూ యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసింది. కోహ్లీ సైతం పరుగులు చేస్తున్నా.. సెంచరీ రాక ఇబ్బంది పడ్డాడు. మాజీ క్రికెటర్ల విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. వీటన్నింటికీ తెర దించుతూ అఫ్ఘనిస్థాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో కదంతొక్కాడు. 61 బంతుల్లోనే 12 ఫోర్లు, […]