దేశలోని అన్ని రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో భిన్నంగా ఉంటాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో తరచూ ఆడియో రికార్డులు బయటపడి.. హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవలే నెల్లూరు జిల్లాలో లీకైనా ఆడియో రికార్డు ఏ రేంజ్ లో కలకలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ఆడియో కారణంగా గత కొన్ని రోజుల నుంచి […]
చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్‌లో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. శుక్రవారం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సదంర్భంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో.. అచ్చెన్నాయుడు.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. కుప్పం ఎస్సై శివ కుమార్ ఫిర్యాదు చేశాడు. దాంతో అచ్చెన్నాయుడిపై కేసు నమోదయ్యింది. పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారని ఈ ప్రసంగంపై ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కుప్పం సభలో అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ.. […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచే సభను అడ్డుకోవడానికి ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. సభలో చర్చ జరగనీయకుండా.. మాటికి మాటికి అడ్డుపడ్డారు టీడీపీ నేతలు. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి సభ సజావుగా సాగకుండ చేశారు. ప్రశ్నోత్తారల తర్వాత చర్చిద్దామని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చినా.. టీడీపీ నేతలు ఊరుకోలేదు. అనంతరం స్వీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. దీనిలో అధికార పార్టీ నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు.. ఇతర […]
యుద్ధంలో గెలవాలంటే.. ముందుగా రాజును దెబ్బతీయాలి. దాంతో సైన్యం పరారవుతుంది. రాజకీయాలు అనే యుద్ధంలో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతారు కొందరు నాయకులు. వేర్లనే టార్గెట్ చేయాలి.. అప్పుడు చెట్టు దానంతట అదే కూలిపోతుందని భావిస్తారు. తన ప్రత్యర్థులు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు సీఎం సన్నిహితులు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే.. ఇప్పటి నుంచే క్యాడర్‌ని సిద్ధం చేస్తున్నారు జగన్. […]
ఒక్కసారి భారత రాజకీయ చరిత్రను తరచి చూస్తే.. వారసత్వ రాజకీయాలు వేళ్లునికునిపోయాయి అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. నాటి ప్రధాని నెహ్రూ నుంచి నేటి తరం నాయకులు కేసీఆర్, వైఎస్సార్ వరకు.. వీరంతా తమ రాజకీయ వారసులను తెర మీదకు తీసుకువచ్చారు.. వస్తున్నారు. వారిని అన్ని విధాలుగా ప్రజలకు చేరువ చేసి.. ఆ తర్వాత వారికి పార్టీ కీలక బాధ్యతలు, కొన్ని సందర్భాల్లో సీఎం కుర్చీనే అప్పగిస్తున్నారు. మన దేశంలో ఏళ్లుగా రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. […]
గత ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ హావా ముందు తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన బడ ఫ్యామిలీలు చిత్తుగా ఓడిపోయాయి. అంతటి వైసీపీ హావాను తట్టుకుని కూడా కింజరాపు కుటుంబం మాత్రం నిలబడి విజయాలు సాధించింది. దివంగత కింజరపు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా, ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం టీడీపీ వ్యవహారాలు ఢిల్లీలో అబ్బాయి చూసుకుంటుంటే, రాష్ట్రంలో బాబాయ్ చూసుకుంటున్నారు. తాజాగా వీరి గురించి ఓ […]
టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత స్వరం పెంచారు ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి. పార్టీలో చంద్రబాబు, లోకేష్ బాబులు మంచి వాళ్లే అయినా ఆయన చుట్టూ ఉన్న పెద్దలు.. పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని వాళ్ల బండారాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతోంది దివ్యవాణి. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, అచ్చెన్నాయుడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది దివ్యవాణి. పార్టీలో […]
తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని NTR ట్రస్ట్ భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చన్నాయుడు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు కోసం పార్టీ మారిన వారు చనిపోయిన వారితో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు.. పార్టీ […]
తాజాగా అండమాన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెండు వార్డుల్లో టీడీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అవకాశం దొరికితే టీడీపీ, చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేసేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. అండమాన్ లో టీడీపీ సాధించిన విజయం మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ను అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అవుతారంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఈ […]
తెలంగాణలో టీఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం జరిగిన వార్తలు చదివాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కోవకు చెందిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అచ్చెన్నాయుడిపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం పలాస నియోజకవర్గంలో […]