టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రిబావా భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజకీయలపై ఆసక్తితో 2019లో బీజేపీలో చేరిన రివాబా.. అప్పటి నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్ర సిన్హా జడేజాను కాదని.. బీజేపీ అధిష్టానం రివాబా జడేజాకు బీ ఫామ్ ఇచ్చింది. […]
భారతదేశంలో రాజకీయాలకు, క్రీడలకు విడదీయరాని సంబంధం ఉంది. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు ఏదో ఒక విధంగా రాజకీయాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అజారుద్దీన్, సచిన్, గౌతమ్ గంభీర్ లాంటి మరికొంత మంది ఆటగాళ్లు చట్ట సభలకు సైతం ప్రాతినిథ్యం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన భార్య గెలుపు కోసం జోరుగా ప్రచారం సాగిస్తున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. భార్య రివాబా జడేజా […]