ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి చూడని విజయం లేదు. సాఫ్ట్‌వేర్ రంగంలో తన సంస్థను ఎంతో ఎత్తుకు చేర్చారు. అయితే ఇన్ని సక్సెస్‌లు చూసినా.. తల్లి విషయంలో మాత్రం ఆయనో తప్పు చేశారట. ఆ విషయం గురించి తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే..!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. మరో ఐటీ దిగ్గజ సంస్థ లేఆఫ్స్‌కు తెరతీసింది. ఏకంగా 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటన చేసింది. ఇప్పటివరకు చోటుచేసుకున్న టెక్ కంపెనీల ఉద్యోగుల తొలగింపులో ఇదే అతి పెద్ద లేఆఫ్స్ కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లేఆఫ్స్‌పై దృష్టిపెట్టాయి. ఆర్థిక మాంద్యం, భవిష్యత్తుపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్ లాంటి బడా సంస్థలు ఇప్పటికే చాలా మంది ఎంప్లాయీస్‌ను ఇంటికి పంపించేశాయి. తాజాగా డెల్ సంస్థ కూడా 6,600 మంది ఉద్యోగులను తీసేసేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఐటీ ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. తమ జాబ్ ఉంటుందో, ఊడుతుందోనని వారిలో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో ఉద్యోగులపై […]
ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం సిబ్బందిలో 5 శాతానికి సమానమైన 11,000 మంది ఎంప్లాయీస్‌ను తీసేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా లాంటి బడా టెక్ కంపెనీలు లే ఆఫ్స్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తోంది. బుధవారం నుంచే ఈ సంస్థలో తొలగింపు […]
కరోనా మహమ్మారి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఎందరో ఉపాధి కోల్పోయారు. మరెందరో అయినవారిని పోగొట్టుకొని అనాథలుగా మారారు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ ఒక వెలుగు వెలిగింది అంటే ఐటీ రంగం మాత్రమే. ఎన్నో కొత్త నియామకాలు చేపట్టి ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించింది. ఇంతటి ప్రగతి సాధించిన ఐటీ రంగం నేడు తీవ్ర సంక్షోభంతో అతలాకుతలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒక్క మన దేశమే […]
వచ్చే ఏడాది నాటికి దేశంలో 30 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఎసరు తప్పదని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ రంగంలో 1.6 కోట్ల మందికిపైగా పనిచేస్తుండగా 2022 నాటికి 30 లక్షల మందిని తగ్గించుకోవాలని సంస్థలు భావిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఫలితంగా ఏడాదికి దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని తెలిపింది. భారత్ అవసరాల కోసం పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి సరాసరి వార్షిక వేతనం 25,000 డాలర్లు, అమెరికా అవసరాల […]