'రూ. 1,200'.. ఒక గ్యాస్ సిలిండర్. ఈ రేటు చూస్తుంటే కట్టెల పొయ్యి మీద వండిన రోజులు అందరికీ గుర్తుకొస్తున్నాయి. కట్టెలు కొట్టుకురావడం.. అవి ఎండటం కోసం బయటపెట్టడం.. ఆ క్రమంలో వర్షాలు పడ్డప్పుడు వాటిని తీసుకెళ్లి ఇళ్లలో దాచుకోవటం.. ఆ జ్ఞాపకాలే వేరు. కాస్త కష్టమైనా వంటయితే వండుకొని కడుపునిండా ఆరగిలించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ధర ఎక్కువుగా ఉండటంతో గ్యాస్ సిలిండర్ కొనాలంటేనే భయపడిపోతున్నారు.. అందుకే మీకు ఊరట కలిగించే శుభవార్త ఒకటొచ్చింది.
గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చి ఇచ్చినందుకు డెలివరీ ఏజెంట్ కు అదనంగా డబ్బులు చెల్లించే పరిస్థితి ఉంది. కొంతమంది ఇష్టంతో ఇచ్చినా, కొంతమంది అయిష్టంగానే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది. ఇక డెలీవరీ ఏజెంట్లకు గ్యాస్ ఏజెన్సీలు నెల నెలా జీతాలు ఇస్తున్నప్పుడు.. అదనపు ఛార్జీలు ఎందుకు ఇవ్వాలి అనే వాదన కూడా లేకపోలేదు. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కూడా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంపై గతంలో హెచ్పీసీఎల్ కంపెనీ స్పందించింది. డెలివరీ బాయ్ […]
ప్రస్తుతం పొయ్యి పెట్టి.. దాని ముందు కూర్చుని.. పొగతో ఇబ్బంది పడుతూ.. వంట చేసే కాలం పోయింది. నేడు దాదాపు 90 శాతం జనాభా గ్యాస్ సిలిండరే వాడుతున్నారు. గ్యాస్ మీద ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ వంటి వాటి గురించి పక్కన పెడితే.. గ్యాస్ బుక్ చేయగానే.. డెలివరీ బాయ్.. ఇంటికి వచ్చి గ్యాస్ ఇచ్చిపోతాడు. ఊరికే పోడు.. గ్యాస్ తెచ్చినందుకు అదనంగా 20, 30 రూపాయలు అడుగుతాడు. పోనిలే ఇంటికే తెచ్చాడు కదా.. అనే ఉద్దేశంతోనే.. […]
న్యూ ఢిల్లీ- ప్రతి రోజు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మొన్నా మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ చమురు కంపెనీల రోజు వారి రివ్యూలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి జనం వాహనాలు నడపాలంటేనే వణికిపోతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో పెట్రోల్, […]