ఈ మద్య వరుసగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రభావం వాహనదారులపైన మాత్రమే కాదు.. ప్రయాణీకులపై భారీగా పడుతుంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరోసారి షాకిచ్చింది. డీజిల్ సెస్ ఛార్జీల పేరుతో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ ప్రకటించింది. ఇటీవలే వరుసగా ఆర్టీసీ చార్జీలు పెంచుతూ వచ్చింది ప్రభుత్వం. ఇంతలోనే ఇప్పుడు ఇంధన ధరలు పెరగడంతో టికెట్ రేట్లు పెంచే దిశగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న పల్లెవెలుగు, సిటీ, […]