ఇండస్ట్రీలో దాదాపు చాలామంది డైరెక్టర్లు ఆడియన్స్ పల్స్ తెలుసుకొని తమ సినిమాలో కమర్షియల్ ఎలెమెంట్స్ ఉండేలా చూసుకుంటారు. కానీ.. కొంతమంది దర్శకులు మాత్రం తాము నమ్మిన కథతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫలితం ఎలా ఉన్నా.. వారి సినిమాలకు మంచి ఆదరణ అయితే లభిస్తుంది. ఈ లిస్టులో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు డైరెక్టర్ హను రాఘవపూడి.
ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటే బాలీవుడ్ పేరు చెప్పుకునే వాళ్లు. కానీ బహుబలి తర్వాత ట్రెండ్ మారిపోయింది. టాలీవుడ్ వైపు బాలీవుడే కాదూ హలీవుడ్ కూడా చూసేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. మల్టీస్టారర్స్‌తో, భారీ కాస్టింగ్.. బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం భారీగా వసూళ్లు చేసి.. ఆస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో టాలీవుడ్ మేకర్స్‌పై భారీ అంచనాలు పెరిగాయి. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండీల్ వుడ్ అగ్ర నటులు టాలీవుడ్ నటులతో తెర పంచుకునేందుకు […]
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రేమకథా చిత్రాలు అరుదుగా వస్తున్నాయి. లవ్ స్టోరీస్ లో కూడా ప్రేక్షకుల గుండెను పిండేసి ఏడిపించే సినిమాలు ఇంకా అరుదు. అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్తుంటారు. ఇటీవల ‘సీతారామం‘ మూవీ విషయంలో అదే జరిగింది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం […]
తెలుగు ఇండస్ట్రీలో సున్నితమైన ప్రేమకథలను తెరపై ప్రేమకావ్యంలా చూపించగల దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. గతంలో లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా దర్శకుడు కరుణాకరన్ పేరు తెచ్చుకున్నాడు. దాదాపు కరుణాకరన్ కెరీర్ లో అన్నీ లవ్ స్టోరీస్ తెరకెక్కించారు. ఇక ఇప్పుడున్న దర్శకులలో హను రాఘవపూడి ప్రేమకథల స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు. తన మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ మొదలుకొని కృష్ణగాడి వీరప్రేమగాథ, పడిపడి లేచే మనసు, లై.. తాజాగా సీతారామం వరకు ఎక్కువగా అన్ని కథలను ప్రేమకు […]
సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ని దర్శకులు కొనియాడుతూ మాట్లాడటం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అడగ్గానే సినిమా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెబుతుంటారు. అయితే.. ఇటీవల సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి.. హీరోయిన్ రష్మిక మందాన గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రష్మిక గురించి డైరెక్టర్ హను ఏం మాట్లాడాడు? అనే వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల […]
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్న ఇంకా వసూళ్ల పరంపర కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమ కథని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడి సక్సెస్ అయ్యారు. స్టోరీ బాగుంటే.. సినిమాలు సక్సెస్ అవుతాయని మరో సారి ప్రేక్షకులు రుజువు చేశారు. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్రం […]
టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. లై, పడిపడి లేచే మనసు ప్లాప్స్ తర్వాత ‘సీతారామం‘ అనే కంప్లీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ భామ మృణాళి ఠాకూర్ లను హీరోహీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అలాగే విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక […]
సినిమాని థియేటర్లో చూస్తేనే మజా. ప్రేక్షకుల అరుపుల మధ్య మూవీని ఎంజాయ్ చేయడం మంచి అనుభూతిని ఇస్తుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ సభ్యులు సైతం రిలీజ్ రోజు థియేటర్లలో తమ సినిమాలు చూడటం మెుదలు పెట్టారు. చూశాక తమ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ తన సినిమాని ప్రేక్షకుల మధ్య చూసి కన్నీరు కార్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. హను రాఘవపూడి దర్శకత్వంతో […]
హీరోగా అన్ని తరహా పాత్రలు చేసినా.. కథానాయకుడిగా రావాల్సిన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయాడు సుమంత్. అందుకే ఈసారి రూటు మారుస్తున్నాడట ఈ అక్కినేని కాంపౌండ్ హీరో. అక్కినేని కుటుంబంలోని మూడోతరంలో ముందుగా వచ్చిన కథానాయకుడు సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు కూతురు కుమారుడైన సుమంత్..1999లో ‘ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత ‘యువకుడు’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘మధుమాసం’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘మళ్లీరావా’ వంటి […]