గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మంచి ఉద్యోగం వస్తే చదువుకున్న చదువుకు న్యాయం జరుగుతుంది అని ఉద్యోగం కోసం ఎదురుచూస్తే జీవితం అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఇచ్చేంత కెపాసిటీ కంపెనీలకు లేవు. అందరూ సాఫ్ట్ వేర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు అయిపోతే వ్యవసాయం చేసేది ఎవరు? కూలి పనులు చేసేది ఎవరు? ఏదైనా పనే. ఏ పని చేసినా గౌరవంగా చేయాలి. నలుగురు గౌరవించేలా చేయాలి. ప్రస్తుతం యువత ఆలోచనలు ఇలానే ఉన్నాయి.
నేటికాలంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ఎక్కడ చూసిన ఉద్యోగం కోసం నిరీక్షించే వారే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇక ఏదైన మంచి జాబ్ వస్తుందంటే డబ్బులు ఇచ్చేందుకు కూడా కొందరు వెనకాడటం లేదు. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగం, ప్రభుత్వ జాబ్ కోసం లక్షల్లో డబ్బులు కుమ్మరిస్తుంటారు. లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలను డబ్బులతో సొంతం చేసుకుంటారు. లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాల కోసం భారీగా డబ్బులను ఖర్చు పెట్టి దక్కించుకునే వారు ఓ వైపు […]