భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఆఫీస్ లకు సెలవులు పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు క్రికెట్ ప్రేమికులు. ఇక ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించిన సందర్బాలూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గి.. ఉత్సాహంతో ఉంది టీమిండియా. మంగళవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తొలి వన్డే అస్సాంలోని గౌహతి వేదికగా జరగబోతోంది. […]