నీరు, కరెంట్ ఈ రెండూ మనిషికి చాలా అవసరం. ఇప్పటికే కరెంటు వాడకానికి విద్యుత్ మీటర్ల ద్వారా ఎన్ని యూనిట్లు వాడితే అన్ని యూనిట్లకు యూనిట్ కి ఇంత అని చెప్పి బిల్ చెల్లిస్తున్నాం. అలానే ప్రభుత్వం ఇచ్చే నీటి సరఫరాకు కూడా ఏడాదికొకసారి పన్ను కడుతున్నాం. అయితే భూగర్భజలాలను (బోరు నీటిని) వాడుకునే వారు కూడా ఇక నుంచి డబ్బులు కట్టాలి. అయితే ఇది అందరికీ కాదు. కేవలం పరిమితి దాటి నీటిని వాడుకునే వారికి మాత్రమే. ఆ పరిమితి ఎంత? అనేది తెలుసుకోండి.
రాజుల కాలంలో.. ఆఖరికి బ్రిటీషర్ల పాలనలో కూడా మన దేశంలో వింత వింత పన్నులు ఉండేవి. ఇళ్లు కడితే పన్ను.. పెళ్లి చేసుకుంటే పన్ను.. ఆఖరికి.. రాజుగారి విలాసాల కోసం కూడా.. సామాన్య ప్రజల మీద పన్ను విధించేవారు. రకరకాల పన్నులతో ప్రజల నడ్డి విరిచేవారు. రాజులు పోయాయి.. రాజ్యాలు పోయాయి.. కానీ పన్ను వ్యవస్థ మాత్రం పోలేదు. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు.. మన సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి పన్నులు […]