ఇటీవల కాలంలో దేశంలో పలు చోట్ల మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి. పలు అవమానకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతమైన విద్యనభ్యసించడానికి ప్రవేశ పరీక్ష కోసం హాజరయ్యేందుకు వచ్చిన యువతుల పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది. కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ నీట్ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తామని చెప్పారు. అయితే.. ఎన్టీఏ […]